English | Telugu
నాకు మళ్ళీ మాటొచ్చిందోచ్!?
Updated : Aug 26, 2022
నటి శ్రీవాణి గురించి స్పెషల్ గా ఏమీ చెప్పక్కర్లేదు. బుల్లి తెర ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ ఐన శ్రీవాణి యూట్యూబ్ పెట్టి అందులో కూడా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెల క్రితం శ్రీవాణి తాను ఇక మాట్లాడలేనంటూ డాక్టర్స్ చెప్పారని ఒక బాడ్ న్యూస్ చెప్పింది. రెస్ట్ తీసుకుని ఫుల్ గా హెల్తీగా అయ్యాక ఇప్పుడు మళ్ళీ మాట్లాడింది శ్రీవాణి.
ఐతే ఇటీవల ఆగష్టు 19 న మళ్ళీ డాక్టర్స్ దగ్గరకి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ఇక ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారని చెప్పింది శ్రీవాణి. థ్రోట్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయిందని మాములుగా మాట్లాడొచ్చని చెప్పారు.ఇక ఆ గుడ్ న్యూస్ ని శ్రీవాణి "మేడం అంతే" యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫాన్స్ కి చెప్పారు. మళ్లీ తిరిగి మాట్లాడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. “ ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని డాక్టర్స్ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మాట్లాడలేకపోయినా సరే మీరు పెట్టే మెసేజ్‌లు చదువుతూ ఉన్నాను. నాకోసం. నా ఆరోగ్యం కోసం దేవుడికి ప్రార్దించిన అందరికీ థాంక్స్.
2002 నుంచి ఇప్పటివరకు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఇంత మంది ఫాన్స్ నాకు ఉన్నారని ఇప్పటిదాకా తెలియదు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ శ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు.